దుబాయ్‌లో మహిళలకు పని ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. పాతబస్తీ బ్రోకర్లు ఒక్కో మహిళను 2 లక్షలకు దుబాయ్ షేక్‌లకు అమ్మారు. విజిటింగ్ వీసాలపై పంపి మహిళలను బ్రోకర్లు విక్రయించారు. మొత్తం ఐదుగురు మహిళలను అమ్మాకనికి పెట్టారు. బాధిత బంధువులు విదేశి వ్యవహారాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు మహిళలను దుబాయి, యూఏఈలో రెండు లక్షలకు అమ్మినట్లు.. వారిని కాపాడాలని అధికారులను వేడుకున్నారు.