ETV Bharat / jagte-raho

బాలుడి కిడ్నాప్ డ్రామా... విస్తుపోయిన పోలీసులు! - సత్తెనపల్లి బాలుడి కిడ్నాప్ అప్​డేట్

ఫోన్ ఎక్కువగా చూస్తున్నాడని తండ్రి మందలించటం ఆ బాలుడికి నచ్చలేదు. తన తండ్రిని బెదిరించాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి దుకాణంలో పనిచేస్తున్న 17 ఏళ్ల గుమాస్తాతో కలిసి కిడ్నాప్ పేరిట డ్రామా ఆడాడు. అటు తల్లిదండ్రులను.. ఇటు పోలీసులను పరుగులు పెట్టించాడు. ఇంత చేసిన ఆ బాలుడి వయసు కేవలం 12 ఏళ్లే.

బాలుడి కిడ్నాప్ డ్రామా... విస్తుపోయిన పోలీసులు!

author img

By

Published : Nov 18, 2020, 1:48 PM IST

Updated : Nov 18, 2020, 2:43 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి బాలుడి అదృశ్యం కేసు కొత్త మలుపు తిరిగింది. అదృశ్యమైన బాలుడే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసుల విచారణలో తేలింది. సెల్​ఫోన్ ఎక్కువగా చూస్తున్నాడని తండ్రి తిడుతున్నాడనే ఇంతటి పని చేశాడని పోలీసులు నిర్దరణకు వచ్చారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిన్న బాలుడు అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. వస్త్ర దుకాణం నిర్వహించే వెంకటేశ్వర్లు కుమారుడు వినయ్. తరచూ ఫోన్ చూస్తుండే వాడు. దీన్ని గమనించిన తండ్రి రోజూ మందలించేవాడు. తండ్రి తిట్టడాన్ని సహించలేకపోయిన వినయ్​... తండ్రిపై కోపాన్ని పెంచుకున్నాడు.

తండ్రిని బెదిరించాలనే ఆలోచనకు వచ్చిన వినయ్​... దుకాణంలో పని చేస్తున్న 17ఏళ్ల ప్రమోద్​ రాజ్​కుమార్​తో మనసులో మాట చెప్పాడు. డబ్బులకు ఆశ పడిన అతను ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి కిడ్నాప్​ డ్రామాకు తెరతీశారు. ఇంట్లో నుంచి వెళ్తూనే తాతయ్య వద్ద ఉండే ఫోన్​లో సిమ్​ తీసుకెళ్లిపోయాడు వినయ్​.

అనుకున్న పథకం ప్రకారం... గుమస్తా ఇంట్లో వినయ్​ దాక్కున్నాడు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఇద్దరూ జాగ్రత్త పడ్డారు. తాతయ్య దగ్గర నుంచి తీసుకొచ్చిన సిమ్​ కార్డు ద్వారా వెంకటేశ్వర్లుకు ఫోన్​ చేసి వినయ్​ను కిడ్నాప్ చేసినట్టు చెప్పాడు. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. మున్నా గ్యాంగ్​ పేరుతో ఈ కాల్స్ చేశారు.

బెదిరిపోయిన వెంకటేశ్వర్లు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో మరోసారి వెంకటేశ్వర్లకు ఫోన్ చేసిన వినయ్​... తన డిమాండ్లపై బేరాలు మొదలుపెట్టాడు. చివరకు 10 వేలు ఇస్తే చాలని చెప్పాడు. చివరకు వారు డిమాండ్ చేసినట్లే పట్టణ శివారులోని ఓ పాత కారు కింద 10వేల రూపాయల కట్టను పోలీసులు చెప్పినట్లే ఉంచాడు వినయ్ తండ్రి వెంకటేశ్వర్లు. ఆ మొత్తాన్ని తీసుకోవడానికి ఎవరూ రాలేదు. పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం కావడంతో ఆగంతుకులు దార్లోకి వచ్చారు.

దర్యాప్తు కొనసాగించిన పోలీసులు... ఏ ఫోన్​ నుంచి కాల్స్ వస్తున్నాయో గుర్తించారు. అది ఇంటినెంబరే అని తెలిసే సరికి ఇది పరిచయస్తులే పనిగానే అనుమానించారు. చివరకు కాల్స్​ వస్తున్న ప్రాంతాన్ని ట్రేస్ చేసి... వినయ్​ను పట్టుకున్నారు.

రాత్రంతా విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు చెప్పాడు వినయ్. తన ప్లాన్​ ఆఫ్​ యాక్షన్ మొత్తాన్ని వివరించాడు. తండ్రిని బెదిరించాలనే ఇదంతా చేసినట్టు ఒప్పుకున్నాడు. వినయ్ సమాధానం విన్న పోలీసులు అవాక్కయ్యారు.

పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని... ఫోన్​లు ఇస్తున్నప్పుడు వాళ్లపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: పోలీస్ స్టేషన్​లో రియల్ ఫైట్.. కుర్చీలు కర్రలతో ఇరువర్గాల దాడి

Last Updated : Nov 18, 2020, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.