యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి పట్టణంలో కంసాని దుర్గాప్రసాద్ (15)అనే బాలుడు గురువారం ఉదయం స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
చుట్టుపక్కల ఇళ్లు, బంధువుల ఇళ్లలో వెతికారు. ఎక్కడా కనిపించకపోవడం వల్ల దుర్గాప్రసాద్ మేనమామ శ్రీహరి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై రాజు బాలుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.