ETV Bharat / jagte-raho

పుట్టినరోజు వేడుకలకు వెళ్లాడు.. విగతజీవిగా తిరిగొచ్చాడు! - పెరుమూళ్లపల్లె వాగులో సుమంత్ మృతదేహం లభ్యం

స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వాగులో గల్లంతైన బాలుడి మృతదేహం దొరికింది. విగతజీవిగా కనిపించిన కొడుకును చూసిన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా మెదుకుకుప్పం మండలం పెరుమాళ్లపల్లెలో జరిగింది.

పుట్టినరోజు వేడుకలకు వెళ్లాడు.. విగతజీవిగా తిరిగొచ్చాడు!

author img

By

Published : Sep 27, 2020, 10:57 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పెరుమాళ్లపల్లె గ్రామానికి చెందిన నరసింహా రెడ్డి కుమారుడు సుమంత్... స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలకు శనివారం స్థానికంగా ఉన్న వాగుకు వెళ్లాడు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో సుమంత్​ ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు.

సమాచారం తెలుసుకున్న అధికారులు, గ్రామస్థులు అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ బాలుడి ఆచూకీ దొరకలేదు. ఇవాళ ఉదయం మళ్లీ గాలింపు చేపట్టి వాగు నుంచి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. విగతజీవిగా ఉన్న కుమారుడుని చూసిన ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:

చిత్తూరు జిల్లాలో ఏనుగు దాడి.. వృద్ధురాలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.