జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జిపై డివైడర్ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఎర్రవల్లి నుంచి గద్వాలకు కోళ్ల వ్యాపారం కోసం వెళుతున్న వాహనం మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఢీకొంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదు.
నాణ్యతా లోపాల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: రెండు నెలల్లో... రెండు ఏటీఎంలలో... లక్షల్లో చోరీ