ETV Bharat / jagte-raho

బ్లేడ్ బ్యాచ్ ఘాతుకం.. యువకుడి గొంతు కోసి...

author img

By

Published : Nov 16, 2020, 10:25 AM IST

బ్లేడ్ బ్యాచ్​ ముఠా సభ్యుడు ఓ యువకుడి గొంతుకోసి హత్యాయత్నానికి పాల్పడ్డిన ఘటన ఏపీ విజయవాడ నగర శివారు రామవరప్పాడులో చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దారుణానికి ఒడిగట్టింది స్థానికంగా ఉన్న బ్లేడ్ బ్యాచ్​ సభ్యులు సాహో అతని స్నేహితులుగా పోలీసులు గుర్తించారు.

blade batch
విజయవాడ: యువకుడి గొంతు కోసిన బ్లేడ్ బ్యాచ్

ఆంధ్రప్రదేశ్​ విజయవాడ నగర శివారు రామవరప్పాడులో దారుణం చోటుచేసుకుంది. బ్లేడ్ బ్యాచ్​ ముఠా సభ్యుడు ఓ యువకుడి గొంతుకోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... హను​మాన్ నగర్ శివారు పొలాల్లో గంజాయి సేవించిన నలుగురు యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఘర్షణలో సురేంద్ర అనే యువకుడిపై సాహో అలియాస్ సాయి అనే వ్యక్తి బ్లేడ్​తో తీవ్రంగా దాడి చేశాడు. సురేంద్ర చనిపోతాడనే భయంతో అతని చొక్కాని మెడకు చుట్టి సమీపంలోని అపార్ట్​మెంట్ లిప్ట్​లో వదిలి వెళ్లాడు.

రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న సురేంద్రను గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దారుణానికి ఒడిగట్టింది స్థానికంగా ఉన్న బ్లేడ్ బ్యాచ్​ సభ్యులు సాహో అతని స్నేహితులుగా గుర్తించారు.

ఇదీచదవండి: నేడు టీఎస్‌బీపాస్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్న కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.