ETV Bharat / jagte-raho

రేమిడిచర్లలో క్షుద్రపూజల కలకలం... బాలిక అదృశ్యం! - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

రేమిడిచర్లలో బాలిక అదృశ్యంతో క్షుద్రపూజల గుట్టు రట్టు అయింది. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా... బాలిక మేనమామ ఇంట్లో క్షుద్రపూజల ఆనవాళ్లు దర్శనమిచ్చాయి. ఆ ఇంట్లో పెద్ద గొయ్యి కనిపించింది. బెంగుళూరుకు చెందిన వారితో ఆమె మేనమామ క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారని స్థానికులు తెలిపారు. బాలికతో సహా వారంతా పరారీలో ఉన్నారు. ఈ ఘటనతో గ్రామస్థులంతా ఉలిక్కిపడ్డారు.

black-magic-with-girl-at-remidicherla-in-khammam-district
రేమిడిచర్లలో క్షుద్రపూజల కలకలం... బాలిక అదృశ్యం!
author img

By

Published : Dec 19, 2020, 12:59 PM IST

రేమిడిచర్లలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. బాలిక అదృశ్యంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో పదిహేడేళ్ల బాలిక గురువారం సాయంత్రం నుంచి కనిపించకపోవడం వల్ల పోలీసులు విచారణ చేపట్టగా... క్షుద్ర పూజల అంశం వెలుగుచూసింది.

బాలిక తల్లి వేరే ఊరు వెళ్లి ఇంటికి వచ్చినప్పటి నుంచి అమ్మాయి కనిపించడం లేదని వాపోయింది. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్సై గోపాలరావు, పోలీసు సిబ్బందితో రేమిడిచర్లలోని ఆమె మేనమామ నివాసానికి వెళ్లగా... తమ ఇంట్లోకి రావద్దని వారు అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. అనుమానం వచ్చిన ఎస్సై ఉదయ్ కిరణ్ వెళ్లి తలుపులు తీయించగా పెద్ద గొయ్యి కనిపించింది.

ఆ గొయ్యిలో బాలికను కూర్చోబెట్టి... క్షుద్ర పూజలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికతో సహా వారంతా పరారీ అయినట్లు వెల్లడించారు. కొన్ని రోజులుగా బెంగుళూరుకు చెందిన వారితో పాటు స్థానికులు ఆ ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. కేసు విచారణ కొనసాగుతోందని... పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు.

ఇదీ చదవండి: పురుగులమందు తాగి మైనర్ ప్రేమజంట ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.