జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్‌కు చెందిన కృష్ణ దినసరి కూలీ. చెడు అలవాట్లకు బానిసైన అతను నగరంలోని వివిధ ప్రాంతాల్లో బైక్ దొంగతనాలు చేసేవాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడు కృష్ణని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 7 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: ముందు జాగ్రత్తగా మందులు.. దండిగా ఖర్చులు..