నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బార్డిపూర్ శివారులోని ఓ కల్యాణ మండపంలో భారీ చోరీ జరిగింది. సిద్దిపేటకు చెందిన అబ్బాయితో మహారాష్ట్రలోని ఉమ్రికి చెందిన అమ్మాయికి వివాహం నిర్వహించారు. పెళ్లి కూతురు నగలు ఓ బ్యాగ్‌లో పెట్టారు.
![big theft at function hall in nizamabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nzb-13-23-pellilo-chori-av-3180033_23122020221132_2312f_1608741692_590.jpg)
![big theft at function hall in nizamabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nzb-13-23-pellilo-chori-av-3180033_23122020221132_2312f_1608741692_253.jpg)
మధ్యాహ్నం సమయంలో వివాహం జరుగుతున్న వేదిక వద్దకు ఇద్దరు యువకులు వచ్చి ఆ బ్యాగ్‌ను అపహరించారు. నగలు పెట్టేందుకు చూడగా బ్యాగ్ కనపడకపోవటంతో పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. దాదాపు 35 తులాల బంగారు ఆభరణాలు దుండగులు అపహరించినట్లు బాధితులు తెలిపారు.
![big theft at function hall in nizamabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nzb-13-23-pellilo-chori-av-3180033_23122020221132_2312f_1608741692_781.jpg)
ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త: మీ మెయిల్లోకి దూరేస్తాడు.. రహస్యాలన్నీ కాజేస్తాడు!