ETV Bharat / jagte-raho

ఏటీఎం దొంగ ఎట్టకేలకు చిక్కాడు

అనేక జిల్లాల్లో ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న కరుడు గట్టిన దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన భద్రాద్రి జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడిపై ఇప్పటివరకు 14 చోట్ల కేసులు నమోదైనట్లు సీఐ వెల్లడించారు.

polices arrest atm theft in bhadrachalam
ఏటీఎంలే అతని టార్గెట్... ఎట్టకేలకు చిక్కిన నిందితుడు
author img

By

Published : Feb 5, 2021, 7:24 PM IST

Updated : Feb 5, 2021, 7:30 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న దొంగను భద్రాచలం సీఐ స్వామి అరెస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన బాణాల ప్రశాంత్... జయశంకర్​ భూపాల పల్లి, ములుగు, వరంగల్, నల్గొండ, ఏపీలోని విజయవాడలలో ఏటీఎంలలో దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

14 చోట్ల ఇతనిపై కేసు నమోదైనట్లు సీఐ తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో ప్రశాంత్​ను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్పీ సునీల్​దత్​ను సీఐ అభినందించారు.

ఇదీ చూడండి: 20ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్​

Last Updated : Feb 5, 2021, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.