ETV Bharat / jagte-raho

మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి హత్య.. నిందితుడి అరెస్టు - నిందితుడి అరెస్టు

మద్యం మత్తులో మాట్లాడిన అసభ్యకరమైన మాటలతో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన... హైదరాబాద్​లోని బాలాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడు ఉత్తరప్రదేశ్​కు చెందిన అమాన్​ ఖాన్​గా పోలీసులు చెబుతున్నారు.

balapur police arrest accused in murder case
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి హత్య.. నిందితడి అరెస్టు
author img

By

Published : Nov 21, 2020, 5:57 AM IST

Updated : Nov 21, 2020, 7:22 AM IST

హైదరాబాద్​ శివారులోని బాలపూర్ పీఎస్​ పరిధిలో దారుణ హత్య చోటుచేసుకుంది. వాదీ ఏ సలేహిన్​కు చెందిన ఇమ్రాన్​, ఖుబా కాలనీలో ఉంటే ఉత్తరప్రదేశ్​ వాసి అమాన్​ ఖాన్​ స్నేహితులు. ఇద్దరు కలిసి తరుచూ మద్యం సేవించేవారు. అమాన్ మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటమే కాకుండా... ఇమ్రాన్​ భార్యను లైంగికంగా వేధించేవాడని చెబుతున్నారు. ఎంత చెప్పినా పద్దతి మార్చుకోకపోవడం వల్ల హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.

చాంద్రాయణగుట్టలో ఇద్దరు కలిసి ఓ బార్​లో మద్యం సేవించారు. ఇంటికి వెళ్తూ... మాంసం తీసుకునేందుకు దుకాణానికి వెళ్లారు. ఆ సమయంలో ఇద్దర మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన ఇమ్రాన్​ అక్కడే ఉన్న కత్తి తీసుకొని దాడి చేసి పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న అమాన్​ను ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఇమ్రాన్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: నగరంలో మరోసారి పట్టుబడ్డ హవాలా డబ్బు

Last Updated : Nov 21, 2020, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.