ETV Bharat / jagte-raho

శిశువు విక్రయ ఘటనను ఛేదించిన పోలీసులు - bhuvanagiri news

యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన శిశువు విక్రయ ఘటనను పోలీసులు ఛేదించారు. మేడ్చల్​ జిల్లా ఘట్కేసర్​ మండలం ఏదులాబాద్​కు చెందిన ఓ మహిళకు.. భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో జన్మనిచ్చిన ఓ యువతి తల్లి శిశువును విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.

baby girl sale issue cracked in bhuvanagiri

author img

By

Published : Sep 23, 2020, 6:41 AM IST

Updated : Sep 23, 2020, 8:54 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్న శిశు విక్రయ ఘటనను పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ నేరేడుమేట్ పోలీస్​స్టేషన్​లో నమోదైన ఓ కేసు విచారణలో భాగంగా... భువనగిరిలో జరిగిన శిశు విక్రయం వెలుగు చూసింది. నేరేడుమెట్ ఎస్సై... యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్ ప్రోటక్షన్ ఆఫీసర్​కి సమాచారం అందించగా కేసు నమోదు చేశారు.

భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఓ యువతి... ఈ నెల 12 న ఆడశిశువుకు జన్మనిచ్చింది. 14న 60 వేల రూపాయలకు శిశువును సదరు యువతి తల్లి... మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులాబాద్​కు చెందిన మరో మహిళకు విక్రయించింది. నేరేడ్​మెట్ పోలీసులు, ఆ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఏదులాబాద్​కు వెళ్లి శిశువును స్వాధీనం చేసుకున్నారు. తల్లీబిడ్డలను భువనగిరి జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్​లో అధికారుల పర్యవేక్షణలో ఉంచారు.

ఇదీ చూడండి: ప్రియుడి మోజులో పడి భర్త ప్రాణాలు తీసిన భార్య

Last Updated : Sep 23, 2020, 8:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.