తుర్కపల్లి ఘటనపై భగ్గుమన్న స్థానికులు, చిన్నారులు సికింద్రాబాద్ అల్వాల్ పరిధిలోని తుర్కపల్లిలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై లైంగికదాడి చేసి అనంతరం గొంతుకోసి హత్య చేశారు దుండగులు. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు బిహారీలను అదుపులోకి తీసుకున్నారు. పాప మృతితో తుర్కపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారి చదివే పాఠశాల విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. పాప మృతికి నివాళిలు అర్పించి ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి మృగాళ్లకు మరణశిక్ష విధించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై స్థానికులు భగ్గుమన్నారు. ఇలాంటి ఘటనలతో పిల్లలను బయటకు పంపాలంటే భయంగా ఉందని వాపోయారు.
ఇప్పటికే విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు బిహారీలను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పాప మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించేందుకు గాంధీకి తరలించారు.
ఇవీ చూడండి:ఆరేళ్ల బాలికపై లైంగికదాడి... అనంతరం హత్య