వరంగల్ అర్బన్ జిల్లా కాశీబుగ్గలోని ఎస్సీ శ్మశానవాటిక వద్ద అప్పుడే పుట్టిన మగశిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా... ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.
శిశువు కుడిచేతికి తల్లిదండ్రులు సునీత, శంకర్ల పేర్లతో కూడిన ట్యాగ్‌ను పోలీసులు గుర్తించారు. శిశువుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఏదైనా అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని శ్మశానవాటికలో పడవేయడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఊర్లో గొడవకి.. తండ్రి చేతిలో కొడుకు బలి