ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో ఆబ్కారీ శాఖ అధికారులు సైకిల్ యాత్ర చేపట్టారు. మాదకద్రవ్యాలకు యువత బానిసకావొద్దని అవగాహన కల్పిస్తూ చేపట్టిన ఈ యాత్రకు ఆబ్కారీ సూపరింటెండెంట్ సోమిరెడ్డి నాయకత్వం వహించారు.
సైకిల్‌పై యాత్ర చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ సాగిన ఈ యాత్రలో జిల్లాలోని ఆబ్కారీ ఎస్సైలు, సీఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఇటీవల జిల్లాలో గంజాయి కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, యువత మత్తుకు బానిసగా మారుతున్నారని సోమిరెడ్డి తెలిపారు. ఆబ్కారీ శాఖ బాధ్యతగా యువతకు అవగాహన కల్పించడానికే ఈ యాత్ర చేపట్టినట్లు వెల్లడించారు.
- ఇదీ చూడండి మిర్యాలగూడలో అనిశాకి చిక్కిన సైట్ ఇంజినీర్