మలక్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రావణా అపార్ట్మెంట్లో వ్యభిచారం గృహంపై పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు విటులు, ఇద్దరు యువతులను పోలీసులు పట్టుకున్నారు. వారు కోల్కతాకు చెందిన వారిగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిర్వాహకుడు జనార్ధన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
రూ.15 వేలకు నెలవారీ అద్దెకు ఫ్లాట్ తీసుకుని వ్యభిచార వ్యాపారం నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతడు కోల్‌కతా నుంచి సెక్స్ వర్కర్లను నగరానికి తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నాడని అన్నారు. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిల ఫొటోలు పంపుతూ పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేవాడని పోలీసులు వివరించారు.
ఇదీ చూడండి : మానవత్వాన్ని చాటుకున్న టెస్కాబ్ వైస్ ఛైర్మన్