ETV Bharat / jagte-raho

ప్రగతిభవన్‌ ముందు హల్​చల్​ చేసిన యువకుడి అరెస్ట్​ - ప్రగతి భవన్​ వద్ద యువకుడి హల్​చల్​ వార్తలు

ప్రగతిభవన్‌ వద్ద ప్లకార్డు పట్టుకొని హల్‌చల్‌ చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువజన కాంగ్రెస్​ కార్యకర్త సాయిబాబాగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Arrest of a young man who haul at Pragatibhavan
ప్రగతిభవన్‌ వద్ద హల్​చల్​ చేసిన యువకుడు అరెస్ట్​
author img

By

Published : Jul 9, 2020, 7:59 AM IST

సీఎం కేసీఆర్​ ఎక్కడంటూ ప్రగతిభవన్‌ వద్ద ప్లకార్డు పట్టుకొని హల్‌చల్‌ చేసిన యువకుడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బి.ఎన్​.రెడ్డి నగర్​లో అతడిని అరెస్టు చేశారు.

ఏం జరిగిందంటే..

బి.ఎన్‌.రెడ్డి నగర్‌కు చెందిన కోట్ల సాయిబాబా బుధవారం తన స్నేహితుడు కృతిక్​తో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రగతిభవన్‌ వద్దకు చేరుకున్నాడు. సీఎం కేసీఆర్​ ఎక్కడ అంటూ తన వెంట తెచ్చుకున్న ప్లకార్డు పట్టుకొని హల్​చల్​ చేశాడు. పోలీసులు పట్టుకునే లోపు అక్కడి నుంచి పరారయ్యాడు.

ఫలితంగా రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సాయిబాబా, అతని స్నేహితుడు కృతిక్​ను అదుపులోకి తీసుకున్నారు. యువజన కాంగ్రెస్‌కు చెందిన కార్యకర్తలుగా గుర్తించారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఇదీచూడండి: సీఎం ఎక్కడ?.. ప్రగతిభవన్​లో యువకుడి హల్​చల్...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.