ETV Bharat / jagte-raho

కేటీఆర్ పీఏనంటూ డబ్బు డిమాండ్‌... అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ - కేటీఆర్​ పీఏ వార్తలు

ktr
ktr
author img

By

Published : Nov 16, 2020, 7:54 PM IST

Updated : Nov 16, 2020, 8:38 PM IST

19:51 November 16

కేటీఆర్ పీఏనంటూ డబ్బు డిమాండ్‌... అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌

ఏపీ మాజీ రంజీ ఆటగాడు నాగరాజును ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ పీఏనంటూ డబ్బు డిమాండ్‌ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేటీఆర్​ పీఏ తిరుపతి రెడ్డి పేరుతో ఫార్మా కంపెనీలకు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 7న ఓ ఫార్మా కంపెనీ మేనేజ్‌మెంట్‌కు ఫోన్ చేసిన నాగరాజు... రూ.15 లక్షలు డిమాండ్ చేశాడు.  

కాలుష్య నియంత్రణ మండలి నుంచి నోటీసులు రాకుండా చూస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నాగరాజు గతంలో 7 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నాగజారును టాస్క్​ఫోర్స్​ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.  

ఇదీ చదవండి : కాంగ్రెస్, భాజపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: హరీశ్

Last Updated : Nov 16, 2020, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.