ETV Bharat / jagte-raho

దా'రుణ'యాప్‌ల కేసులో మరొకరు అరెస్ట్ - LOAN APP cases in telangana latest update

another-person-arrested-in-loan-app-case
దా'రుణ'యాప్‌ల కేసులో మరొకరు అరెస్ట్
author img

By

Published : Jan 4, 2021, 7:33 PM IST

Updated : Jan 4, 2021, 9:48 PM IST

19:31 January 04

దా'రుణ'యాప్‌ల కేసులో మరొకరు అరెస్ట్​

సంచలనం సృష్టిస్తోన్న దా'రుణ' యాప్‌ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. బెంగళూరులోని అన్యూ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్​గా పని చేస్తోన్న కీర్తిని అదుపులోకి తీసుకున్నారు.

గత నెల 25న బెంగళూరులో సైబర్ క్రైం పోలీసులు రుణ యాప్​ల కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కీర్తి.. పోలీసులకు చిక్కకుండా తప్పించకుంది. ఆమెపై నిఘా పెట్టిన పోలీసులు.. తాజాగా ఆమెను బెంగళూరులోనే అరెస్ట్ చేసి హైదరాబాద్​కు తీసుకొచ్చారు. ఆపై రిమాండ్​కు తరలించారు.

42 అప్లికేషన్ల ద్వారా..

లిఫాంగ్ టెక్నాలజీస్, పిన్ ప్రింట్ టెక్నాలజీస్, హాట్ ఫుల్ టెక్నాలజీస్, నాబ్లూమ్ టెక్నాలజీస్, అన్యూ ప్రైవేట్ లిమిటెడ్, తృతిగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 42 అప్లికేషన్లు నిర్వహించినట్లు పోలీసులు తేల్చారు. వీటి ద్వారా ఆన్​లైన్లో సులభంగా రుణాలు ఇచ్చి.. రుణ గ్రహీతలను వేధింపులకు గురిచేస్తున్నట్లు గుర్తించారు. రాజేంద్రనగర్, జగిత్యాల, సిద్దిపేట పీఎస్​ల పరిధిలో చనిపోయిన రుణ గ్రహీతలు.. ఈ కంపెనీల ద్వారా రుణాలు తీసుకున్నట్లు సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో తేలింది.  

ఇప్పటి వరకు 17 మంది అరెస్ట్​..

రుణ యాప్​ల వేధింపులపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్​లో ఇప్పటి వరకు 28 కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేశారు. రుణయాప్​ల కేసులో కీలక సూత్రధారి లాంబో, అతనికి సహకరించిన నాగరాజును 7 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా సైబర్ క్రైం పోలీసులు నాంపల్లి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు వైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.

Last Updated : Jan 4, 2021, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.