ETV Bharat / jagte-raho

కల్తీకల్లు తాగిన ఘటనలో రెండుకు చేరిన మృతుల సంఖ్య - కల్తీకల్లు తాగిన ఘటనలో మరొకరు మృతి

Another died after drinking Contamination toddy in vikarabad district
కల్తీకల్లు తాగిన ఘటనలో మరొకరు మృతి
author img

By

Published : Jan 11, 2021, 9:43 AM IST

Updated : Jan 11, 2021, 12:40 PM IST

09:39 January 11

కల్తీకల్లు తాగిన ఘటనలో రెండుకు చేరిన మృతుల సంఖ్య

వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగిన ఘటనలో మరొకరు మృతి చెందారు. నవాబ్‌పేట్ మండలం వట్టిమినేపల్లిలో ఇవాళ ఉదయం కొమురయ్య(90) మరణించారు. మూడు రోజుల క్రితం వికారాబాద్, నవాబ్‌పేట్ మండలాల్లో కల్తీకల్లు తాగి.. 309 మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు.

మూడు రోజుల క్రితం పెండ్లిమడుగు వాసి కృష్ణారెడ్డి(62) మృతి చెందగా.. తాజాగా కొమురయ్య మృతి చెందారు. ఈ విషయమై ఎక్సైజ్​ అధికారులు విచారణ చేపట్టారు. వైద్య శాఖ కల్తీ కల్లు బాధిత గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి: నిమ్స్ ఆస్పత్రి ఆవరణలో వ్యక్తి ఆత్మహత్య

Last Updated : Jan 11, 2021, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.