హైదరాబాద్‌లోని గగన్‌పహాడ్ వద్ద బురదలో మరో మృతదేహం లభ్యమైంది. మృతుడు అదే ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలుడు అయాన్‌గా గుర్తించారు. ఈనెల 14న భారీ వర్షాల కారణంగా అప్ప చెరువు తెగటం వల్ల రహదారిపైకి భారీగా వరద వచ్చింది.
వరద ధాటికి కొంతమంది వ్యక్తులు, వాహనాలు కొట్టుకుపోగా... బురదలో ఒక్కొక్కటిగా మృతదేహాలు లభిస్తున్నాయి. ఇప్పటివరకు 6 మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: చెరువులను తలపిస్తున్న కాలనీలు... నీటిలోనే ప్రజలు