నారాయణపేట జిల్లా ధన్వాడ మండలానికి చెందిన మద్దెలి నర్సమ్మ(82) ఆసరా పింఛన్ కోసం వచ్చి మరణించింది. ఈనెల గడువు ఈరోజే ముగుస్తుందని చెప్పడంతో హైదరాబాద్ నుంచి ఉదయమే ధన్వాడకు వచ్చింది. లబ్ధిదారులు అధికంగా ఉండడంతో వరుసలో పుస్తకం పెట్టి... ఓ చెట్టు కింద కూర్చున్న చోటే సృహతప్పి పడిపోయింది.
ఈ విషయాన్ని వెంటనే గమనించిన ఇతరులు వృద్ధురాలిని ఆటోలో స్థానిక పీహెచ్సీకి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించగా...అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.