నవమాసాలు మోసి.. పుట్టిన ఆడ శిశువు పేగు తడి ఆరకముందే వదిలించుకుంది ఓ కర్కశ తల్లి. ఆ ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలివెళ్లారు. ఆసుపత్రికి వచ్చిన ఓ వృద్ధురాలు.. తమ పాపకు ఒంట్లో బాగోలేదని చెప్పి.. శిశు వార్డుకు తీసుకుని వచ్చింది. బెంచీపై పడుకోబెట్టి.. పాపకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ కింద వార్డులో ఉన్నాయని... చెప్పి వెళ్లిపోయింది.
ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో వైద్యులు ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారం అందించారు. ఆసుపత్రి సిబ్బంది పాపను వారికి అప్పగించారు. పాప ఆరోగ్యం కుదుట పడే వరకు ఈ ఆసుపత్రిలోనే చికిత్స జరిపిస్తామని... ఐసీడీఎస్ సూపర్ వైజర్ ఉషా తెలిపారు. అనంతరం హన్మకొండలోని శిశువిహార్‌కు తరలిస్తామని చెప్పారు.
- ఇదీ చూడండి: 120 కిలోల గంజాయి పట్టివేత.. ఓ వ్యక్తి అరెస్ట్