హైదరాబాద్‌లో పాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కల్తీపాల వ్యాపారం చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే..
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తిమ్మాపూర్‌కు చెందిన కె.నరసింహ(20), వై.భాస్కర్ (35)లు గత కొంత కాలంగా ఘట్కేసర్ మండలం అవుషాపూర్ గ్రామంలోని జాతీయ రహదారి పక్కన ఓ గదిని అద్దెకు తీసుకుని కల్తీ పాల తయారీ స్థావరాన్ని ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లాలో తక్కువ ధరకు పాలను సేకరించి అవుషాపూర్ తీసుకొచ్చి రాత్రివేళ పాలను కల్తీచేసి తెల్లవారుజామున ట్రాలీ ఆటోలో నగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు ఘట్కేసర్ సీఐ చంద్రబాబు తెలిపారు. వారి నుంచి సుమారు 250 లీటర్ల కల్తీపాలు, ముడి సరుకులు, ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఎస్బీఐ ఏటీఎం చోరీ.. 15 లక్షలు అపహరణ