ETV Bharat / jagte-raho

గురువారం ముగియనున్న ఏసీపీ నర్సింహారెడ్డి కస్టడీ - acp narsimhareddy illegal assets case latest news

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి కేసులో అనిశా దర్యాప్తు కొనసాగుతోంది. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు నాంపల్లిలోని అనిశా కార్యాలయంలో నరసింహారెడ్డిని అధికారులు ప్రశ్నించారు. అతని బినామీ ఆస్తులపై ఆరా తీశారు. రేపటితో నర్సింహారెడ్డి కస్టడీ ముగియనుంది.

acp-narsinghareddy-custody-will-end-on-thursday
గురువారం ముగియనున్న ఏసీపీ నర్సింహారెడ్డి కస్టడీ
author img

By

Published : Oct 7, 2020, 10:42 PM IST

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన ఏసీపీ నర్సింహారెడ్డి కేసులో అనిశా అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాదాపూర్​లోని సర్వే నెంబర్ 64లో ప్రభుత్వ భూమిని నర్సింహారెడ్డి.. తన బినామీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తప్పుడు ఇంటి నెంబర్లు, నకిలీ ఆస్తిపన్ను పత్రాలు చూపించి ఖరీదైన స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. నర్సింహారెడ్డి ఇంటి వద్ద స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాలను అనిశా అధికారులు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించారు. సదరు ఇంటి నెంబర్లు జీహెచ్ఎంసీ రికార్డుల్లో లేవని సిబ్బంది అనిశా అధికారులకు తెలిపారు.

తప్పుడు పత్రాలతో నర్సింహారెడ్డి, అతని బినామీలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తేల్చిన అనిశా అధికారులు, దానికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. కస్డడీలో భాగంగా నర్సింహారెడ్డిని అనిశా అధికారులు మూడో రోజు ప్రశ్నించారు. హయత్​నగర్, పెద్దఅంబర్ పేట్ ప్రాంతాల్లో బినామీల పేరుమీద స్థలాలు కొనుగోలు చేసినట్లు అనిశా అధికారులు గుర్తించారు. ఏసీపీ నర్సింహ్మారెడ్డి మాత్రం అనిశా అధికారుల విచారణకు పూర్తిగా సహకరించడం లేదు. బినామీ ఆస్తుల గురించి ప్రశ్నించినా దాటవేత ధోరణి అవలంబిస్తున్నాడు. దీంతో అనిశా అధికారులు ఆధారాలతో సహా నర్సింహారెడ్డి ముందుంచి ఆయన నుంచి సమాధానాలు రాబడుతున్నారు. గురువారంతో నర్సింహారెడ్డి కస్టడీ ముగియనుంది.

ఇవీ చూడండి: నోరు విప్పని నర్సింహారెడ్డి.. ఆధారాలు ముందుంచి ప్రశ్నిస్తున్న అనిశా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.