ETV Bharat / jagte-raho

పోలీసు స్టేషన్​ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం - చంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ ముందు నిందితుడి ఆత్యహత్యయత్నం

పోలీసులను భయభ్రాంతులకు గురిచేసేందుకు... ఓ యువకుడు పెట్రోల్​ పోసుకొని, పరుగులు తీసిన ఘటన... చంద్రాయణగుట్ట పీఎస్​ వద్ద చోటుచేసుకుంది. గమనించిన సిబ్బంది మంటలు ఆర్పి, ఆసుపత్రికి తరలించారు.

suicide
పోలీసు స్టేషన్​ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jul 21, 2020, 3:04 AM IST

హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్​ ముందు షబ్బీర్ అనే యువకుడు ఆత్యహత్యాయత్నం చేశాడు. గజిమిల్లత్ ప్రాంతానికి చెందిన షబ్బీర్​... చరవాణీల దొంగతనం కేసులో స్టేషన్​కు పట్టుకొచ్చారు. అతన్ని విచారించగా... అతని వద్ద చిన్న కత్తి, వేరే ప్రాంతంలో దొంగిలించిన ఫోన్​ దొరికింది. ఫోన్​ తీసుకొని మరుసటి రోజు రావాల్సిందిగా పోలీసులు చెప్పి పంపించారు.
బయటకు వెళ్లి కాసేపటి తర్వాత వచ్చిన షబ్బీర్​... పెట్రోల్​ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అంతేకాకుండా బయటకు పరుగులు తీశాడు. గమనించిన సిబ్బంది మంటలు ఆర్పి, ఆసుపత్రికి తరలించారు. సిబ్బందికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడు చంద్రాయణగుట్ట పోలీస్​ స్టేషన్ పరిధి​లో 4 కేసుల్లో జైలుశిక్ష అనుభవించినట్టు సీఐ రుద్ర భాస్కర్ తెలిపారు. అయినా మారకుండా... ప్రజలను, పోలీసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కరోనా విలయం: కోటి 47 లక్షలు దాటిన కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.