ETV Bharat / jagte-raho

ఆటోను ఢీకొన్న బైక్​.. నలుగురికి గాయాలు - latest accidents in nagar kurnool district

ఆటో, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా కల్వకుర్తి మండలం లింగసానిపల్లి సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

accident at nagasanipally in nagar karnool district
ఆటోను ఢీకొన్న బైక్​.. నలుగురికి గాయాలు
author img

By

Published : Jul 26, 2020, 4:20 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం లింగసానిపల్లి సమీపంలో ఆటో, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. రఘుపతిపేటకు చెందిన ఆటో కల్వకుర్తి వైపు వెళ్తుండగా, లింగసానిపల్లికు చెందిన ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై తెలకపల్లి వైపు వెళ్తున్నారు.

లింగసానిపల్లి సమీపంలోకి రాగానే ఒదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ద్విచక్ర వాహనంపై ఉన్న రాఘవేంద్ర గౌడ్, శివ గౌడ్​కు, ఆటోలో ఉన్న కృష్ణయ్య, రహీమ్​కు గాయాలయ్యాయి. వారిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రాఘవేంద్ర గౌడ్, శివ గౌడ్​ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​కు తరలించారు.

ఇవీ చూడండి: శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.