హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి సమీపంలో ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడా వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్రవాహనదారుడు వేగంగా వచ్చి ఆటోను వెనుక నుంచి ఢీ కొట్టి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహం వద్ద లభించిన ఏటీఎం ఆధారంగా వరంగల్‌కు చెందిన పవన్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు.
ఇవీ చూడండి: ఇబ్రహీంపట్నంలో నిర్బంధ తనిఖీలు...