ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ సురేందర్‌పై అనిశా కేసునమోదు చేసింది. ఇటీవల సురేందర్ ఇల్లు, వివిధ ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించినట్లు అనిశా తెలిపింది. రూ.2.79 కోట్ల విలువైన సొత్తు, 28 లక్షల నగదును అధికారులు గుర్తించారు.
అక్టోబర్ 22న రూ.1.65 లక్షలు లంచం తీసుకుంటూ సురేందర్ అనిశాకు చిక్కారు. సురేందర్‌ను అనిశా కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది.