ETV Bharat / jagte-raho

లెక్కచూపని నగదు... అటవీ విభాగం అధికారి అరెస్ట్..​

అటవీ శాఖలో పని చేస్తున్న ఓ అధికారి వద్ద లక్షల్లో డబ్బు దొరకటంతో అతన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేశారు. అనంతరం నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించి మరింత నగదు స్వాధీనం చేసుకున్నారు.

acb arrested forest officer in hyderabad
అటవీ విభాగం అధికారిని అరెస్ట్​ చేసిన ఏసీబీ
author img

By

Published : Dec 13, 2020, 9:49 AM IST

హెచ్ఎండీఏలోని అటవీ విభాగం అధికారి ప్రకాశ్​ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నానక్ రాం గూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో ప్రకాశ్ వద్ద 10 లక్షల 50 వేల రూపాయలు దొరికాయి. ఆయన వాహనంలోనూ 20 వేల రూపాయలను అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆ తర్వాత దూలపల్లిలోని ప్రకాశ్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన అధికారులు 5 లక్షల 14 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 లక్షల 84 వేల రూపాయలకు ప్రకాశ్ లెక్కలు చూపించలేకపోయాడు. దీంతో అనిశా అధికారులు ప్రకాశ్​ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్​ విధించారు.

అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు. గుత్తేదారులు చేసిన పనికి సంబంధించిన బిల్లులు మంజూరు చేయడానికి ప్రకాశ్ లంచం డిమాండ్ చేస్తున్నట్లు అనిశాకు ఫిర్యాదు అందింది. దీనిలో భాగంగా అతనిపై నిఘా పెట్టిన అనిశా అధికారులు... శుక్రవాహం మధ్యాహ్నం నానక్ రాం గూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించటంతో.. ప్రకాశ్ బండారం బయటపడింది.

ఇదీ చదవండి: గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో చిరుత సంచారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.