ఏపీలోని విశాఖ గాజువాకలో విషాదం చోటుచేసుకుంది. శ్రీనగర్ సుందరయ్య కాలనీలో ఎంబీఏ విద్యార్థిని ఎం.ఆహ్లాద(22) ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కి ఉరి వేసుకుంది. ఆమె ఆన్లైన్లోని కొన్ని యాప్‌ల ద్వారా లోన్లు తీసుకుంది. వాటిని చెల్లించాలంటూ ఒత్తిడి ఎదుర్కొనేది.
ఈ క్రమంలో వివిధ యాప్‌ల నుంచి చెల్లింపుల కోసం మెసేజ్‌లు, ఫోన్లు పెద్ద సంఖ్యలో రావడం ఆందోళన చెందేదని ఆమె తల్లి తెలిపారు. సకాలంలో లోన్లు చెల్లింపు చేయలేక తీవ్ర మనస్తాపంతోనే ఆత్మహత్య పాల్పడి ఉంటుందని తల్లి చెబుతోంది.
ఇదీ చదవండి: మేడ్చల్ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం