ETV Bharat / jagte-raho

పుట్టినరోజు వేడుకలో తల్వార్​తో యువకుడి హల్​చల్​ - జగిత్యాల జిల్లా తాజా సమాచారం

జగిత్యాలలో ఓ యువకుడు తల్వార్‌తో హల్‌చల్‌ చేశాడు. తన పుట్టిన రోజు వేడుకలో కత్తిని తిప్పుతూ స్థానికులను భయాందోళనకు గురి చేశాడు.

A young man with a talwar at a birthday party in jagitial district
పుట్టినరోజు వేడుకలో తల్వార్​తో యువకుడి హల్​చల్​
author img

By

Published : Jan 27, 2021, 2:37 AM IST

జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్​నగర్‌లో పవన్ కుమార్ అనే యువకుడు తన పుట్టిన రోజు వేడుకలో తల్వార్​తో హల్‌చల్‌ చేశాడు. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. అంతటితో ఆగకుండా కత్తి​తో స్వీయ చిత్రాలు తీసుకుని వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకున్నాడు.

విషయం తెలుసుకున్న జగిత్యాల రూరల్‌ పోలీసులు పవన్‌ కుమార్‌పై కేసు నమోదు చేశారు. పూర్తి సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: 'నేనే శివుణ్ని... నాకు కరోనా పరీక్షలేంటి?'..పోలీసులకు పద్మజ షాక్ !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.