ETV Bharat / jagte-raho

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి - Latest crime news in warangal

రోడ్డు పనులు చెస్తుండగా ఓ యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా పెండ్యాలలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
author img

By

Published : Aug 8, 2020, 9:58 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలలో ఓ యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. గ్రామంలోని 9 వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చిల్పూర్ మండలం దేశాయితండాకు చెందిన భూక్యా లోకేశ్ ( 19 ) అనే యువకుడు రోడ్డు నిర్మాణంలో కూలీ పనులు చేస్తున్నాడు.

రోడ్డు పక్కన ఉన్న ఒక గుడిసె యజమాని అమర్చుకున్న విద్యుత్ ఎర్త్ వైర్ కి లోకేశ్ అనుకోకుండా తగిలాడు. ప్రమాదవశాత్తు ఆ ఎర్త్ వైర్ కి విద్యుత్ ప్రసారం కావడంతో..... విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

యువకుడు మృత్యువాత పడిన విషయం తెలుసుకున్న బంధువులు పెద్దఎత్తున సంఘటనా స్థలానికి చేరుకొని రోదిస్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పనులు నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మృతుడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చేంత వరకు మృతదేహన్ని తీసే ప్రసక్తే లేదని సాయంత్రం నుంచి ఘటనా స్థలంలోనే నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.