ETV Bharat / jagte-raho

పిల్లలు పుట్టలేదని భర్త చిత్రహింసలు.. సాఫ్ట్​వేర్ ఇంజినీర్ ఆత్మహత్య - suicide latest news

ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. సరేనని తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఎనిమిది సంవత్సరాల పాటు కలిసి జీవించింది. కానీ ప్రేమించిన వాడే వేధించడం మొదలు పెట్టాడు. రోజూ నరకం చూపాడు. అయినా భరించింది. ఆ భర్త అంతటితో ఆగలేదు హింసిస్తూనే ఉన్నాడు. చేసేదేమీ లేక ఆ ఇల్లాలు ప్రాణం విడిచింది. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో జరిగింది.

A women suicide due the husband harassment at shamshabad in rangareddy district
భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య
author img

By

Published : Jun 26, 2020, 7:58 PM IST

Updated : Jun 27, 2020, 9:57 AM IST

భర్త వేధింపులు భరించలేక ఓ సాఫ్ట్​వేర్ ఇంజినీర్​ ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో జరిగింది. శంషాబాద్​లో నివాసం ఉంటున్న లావణ్య ఓ సాఫ్ట్​వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె భర్త వెంకటేశ్వరరావు ప్రైవేట్ ఎయిర్​వేస్​లో పైలెట్​గా పనిచేస్తున్నారు. వీళ్లు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులుగా భర్త వేధిస్తున్నాడని మనోవేదనకు గురైన లావణ్య ఇంట్లోనే గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య

చనిపోయే ముందు ఫేస్​బుక్​లో తన బాధను స్నేహితులతో పంచుకుంది. ఇష్టంగా ప్రేమించిన వ్యక్తే వేధించడం, కొట్టడం బాధగా ఉందని చెప్పింది. "అమ్మా.. నాన్నా.. ఇక నేను బతకలేను. నన్ను క్షమించండి. మీరు నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. మీకు దూరమై పోతున్నా. నా భర్తతో ఇక జీవించలేను." అంటూ చివరి మాటలు చెప్పింది లావణ్య.

భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య

లావణ్యను ఆమె భర్త వెంకటేశ్వరరావు, అత్తమామలు వేధించేవారని లావణ్య సోదరుడు ఆరోపించారు. వివాహేతర సంబంధం కొనసాగించేవాడని.. ఇదేమని ప్రశ్నిస్తే భార్యను తీవ్రంగా కొట్టేవాడని మృతురాలి తల్లిదండ్రులు వాపోయారు. లావణ్యపై చేయి చేసుకున్న దృశ్యాలు తల్లిదండ్రులు పోలీసులకు అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతురాలి భర్త వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య

ఇదీ చదవండి:వారికి స్మార్ట్​ఫోన్లే లేవ్- మరి ఆన్​లైన్​లో చదువెలా?

Last Updated : Jun 27, 2020, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.