హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయన్‌గుట్ట పీఎస్ పరిధిలోని బండ్లగూడకు చెందిన యువతి.. శంషీర్‌గంజ్‌లోని ఓ ఆస్పత్రిలో నర్స్‌గా విధులు నిర్వహిస్తూ ఉండేది. అక్కడ ఆమెకు వట్టేపల్లికి చెందిన ఫాతిమా అనే ఏజెంట్‌తో పరిచయం ఏర్పడింది. యువతిని ఏజెంట్ ఫాతిమా దుబాయ్‌లోని ఓ ఆస్పత్రిలో నర్స్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ డిసెంబర్ 15న అక్కడికి తీసుకెళ్లింది. అనంతరం సూడాన్ దేశస్థుడికి రూ. 2 లక్షలకు అమ్మింది.
ఈ క్రమంలో అతని నుంచి తప్పించుకున్న బాధితురాలు.. భారత రాయబార కార్యాలయానికి చేరుకుంది. అతను తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ఆరోగ్యం క్షీణించి అక్కడి నుంచి తప్పించుకుని ఇండియన్ ఎంబసీకి చేరుకున్నానని బాధితురాలు వెల్లడించింది. ఎంబసీ అధికారులు తనను భారత్‌కు పంపడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయింది. తనను స్వదేశానికి చేర్చాలని చరవాణిలో వీడియో రికార్డులో వేడుకుంది. బాధితురాలి తల్లి.. ఎంబీటీ నేత అంజదుల్లహ్ ఖాన్ ఖలేద్ సహాయంతో భారత్‌లోని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జయశంకర్‌కు లేఖ పంపించారు. తన కూతురును ఇండియాకు రప్పించాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి: ఎవరు లేనిది చూశారు.. ఎనిమిది ఇళ్లను దోచారు!