ETV Bharat / jagte-raho

లాటరీ పేరుతో రూ. 6 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

సైబర్‌ నేరగాళ్ల మోసానికి హైదరాబాద్‌ వాసులు ఇంకా బలవుతూనే ఉన్నారు. సాంకేతికతని ఉపయోగించుకుంటూ వివిధ మార్గాల ద్వారా నేరస్థులు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా నగరంలోని వారాసిగూడకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగిని నుంచి లాటరీ పేరుతో రూ. 6 లక్షలు కాజేశారు.

a private employee was cheated by cyber cheaters hyderabad
లాటరీ పేరుతో రూ. 6 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు
author img

By

Published : Oct 8, 2020, 2:10 PM IST

లాటరీ వచ్చిందని చెబితే నమ్మి ఓ ఉద్యోగిని రూ. 6 లక్షలు పోగొట్టుకున్న సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

వారాసిగూడకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగిని తల్లికి నాప్‌టూల్ షిప్పింగ్ ప్రైవేట్‌ లిమిటెడ్ పేరిట కోల్‌కతా నుంచి స్పీడ్ పోస్టు వచ్చింది. అందులో రూ. 12 లక్షల విలువ చేసే కారు గెలుచుకున్నారని ఉంది. 'మీరు కోరితే కారు లేదా నగదు పొందవచ్చు' అని ఉండటంతో అందులోని నంబర్‌ను ఉద్యోగిని సంప్రదించి డబ్బులే కావాలని కోరింది.

బ్యాంకు ఖాతా నంబరు ఇస్తే డిపాజిట్ చేస్తామని మోసగాడు నమ్మించాడు. బాధితురాలు ఖాతా నంబరు ఇచ్చాక వివిధ ఖర్చుల పేరిట రూ. 6 లక్షలు వేయించుకుని ఆ తర్వాత స్పందించడం మానేశాడు.

చికిత్స డబ్బు కాజేశారు..

చికిత్సకు దాచుకున్న డబ్బు దోచుకున్నాడంటూ బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అన్‌లాక్-5 మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.