రక్తసంబంధాన్ని లేకుండా చేయలనుకున్నాడు.. సొంత అన్ననే కాటికి పంపాలనుకున్నాడు.. చివరికి తానే ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్గల్ నుంచి పెత్తుల్ల వెళ్లే దారిలో ఈ నెల 18న అమీర్పేట సత్తయ్య హత్యకు గురయ్యాడు. మొదట అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. చివరికి హత్యేనని తేల్చారు. ఎగ్గిడి రమేశ్ అనే వ్యక్తి చంపాడని గుర్తించారు.
కందుకూరుకు చెందిన ఎగ్గిడి రమేశ్, సత్తయ్య గత మూడు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములు. అయితే సత్తయ్యకు తన అన్న బీరప్పకు కొన్ని సంవత్సరాలుగా భూ వివాదం కొనసాగుతోంది.
మృతుడు తన అన్న బిరప్పను హత్య చేయించడానికి రమేశ్‌తో రూ.4 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ముందుగా 50 వేల రూపాయలు చెల్లించాడు. నిందితుడు కాలయాపన చేయడం వల్ల విసుగు చెందిన సత్తయ్య ఎందుకు చంపడం లేదంటూ నిలదీశాడు. ఈనెల 18 బీరప్పను చంపుతానని నిందితుడు రమేశ్ చెప్పాడు. నువ్వు కూడా రావాలని సత్తయ్యను కోరాడు. బావి వద్దకు సత్తయ్యను తీసుకెళ్లి.. కారుతో ఢీకొట్టి హత్య చేశాడు. నిందితుడితోపాటు అతనికి సహకరించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
ఇదీ చూడండి: హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం