హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోని ఎన్ఐసీయూ ఉంచిన మగ శిశువును ఓ వ్యక్తి కిడ్నాప్ చేయబోయాడు. ఆడపిల్ల పుట్టడం.. ఆమెకు కాస్త అనారోగ్యంగా ఉండడం సహించలేని ఆ తండ్రి వక్రబుద్ధితో ఆలోచించాడు. ఎన్ఐసీయూ ఉంచిన తన పాపను చూసేందుకు వెళ్లి అక్కడే ఉన్న మగశిశువును ఎత్తుకొని బయటకు వచ్చాడు. తమ బిడ్డ కనిపించకపోయే సరికి అప్రమత్తమైన స్వరూప ఆసుపత్రి సిబ్బందికి సమాచారమిచ్చింది. బాబును ఎత్తుకొని లేబర్ వార్డులో అనుమానస్పదంగా తిరుగుతున్న కిడ్నాపర్‌ను సెక్యురిటీ సిబ్బంది పట్టుకుని చిలకలగూడ పోలీసుకు అప్పగించారు.
ఇవీ చూడండి: తెరవడం తెలియక వదిలేశారు..