హైదరాబాద్ నాచారం పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడు. ఓ పరిశ్రమలోని ముళ్లపొదల్లో మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని చందర్ నాయక్‌గా గుర్తించారు. చందర్ నాయక్‌పై 10రోజుల క్రితం నాచారం పోలీస్ స్టేషన్లో అదృశ్యం కింద కేసు నమోదైనట్లు వెల్లడించారు.
ఇది హత్యేనని వారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు నాచారం పోలీసులు వివరించారు.
ఇదీ చదవండి: పాతబస్తీలో అర్ధరాత్రి యువతి దారుణ హత్య