ETV Bharat / jagte-raho

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కడతేర్చాడు!

author img

By

Published : Dec 12, 2020, 11:55 AM IST

ఓ వివాహితతో వివాహేతర సంబంధం అతని పాలిట యమపాశమైంది. ఇద్దరు పిల్లలున్న మహిళను ప్రేమించాడు. భార్యగా ఆరాధించాడు. వీరికీ ఇద్దరు పిల్లలు పుట్టారు. అనూహ్యంగా వీరిద్దరి మధ్యలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. కట్ చేస్తే ఆ ఇద్దరూ సన్నిహితులయ్యారు. అలా వచ్చిన వ్యక్తి చేతిలో చివరకు బలయ్యాడు.

a person murdered due to illegal affairs at yellammabanda in jagadgirigutta
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కడతేర్చాడు!

వివాహేతర సంబంధం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. ప్రేయసిని కలవడానికి అడ్డు వస్తున్నాడని ఆమె ప్రేమికుడిని కళ్లలో కారం కొట్టి, కత్తితో పొడిచిన ఘటన జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ‌ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్​లో ఆఫ్రీన్‌‌ అనే ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ మొహమ్మద్ అన్సారీ అహ్మద్ జీవనం కొనసాగిస్తున్నాడు. ‌‌ఆఫ్రీన్​కు మొదటి భర్తతో ఇద్దరు పిల్లలు కాగా, అన్సారీ అహ్మద్ వల్ల‌ మరో ఇద్దరు పిల్లలు జన్మించారు.

కొద్దిరోజుల కిందట ఆఫ్రీన్, ఆమె సోదరుడు ఖాసీం మరో వ్యక్తి ఇమ్రాన్​తో కలిసి అన్సారీకి సమాచారం ఇవ్వకుండా ముంబయి వెళ్ళారు. అన్సారీ ఫోన్ చేసి వెనక్కి రమ్మని హెచ్చరించడంతో ముగ్గురూ తిరిగి ఎల్లమ్మబండకు చేరుకున్నారు. ఇమ్రాన్​ను కలిసిన అన్సారీ... ఆఫ్రీన్​కు దూరంగా ఉండాలని హెచ్చరించాడు. ఆగ్రహించిన ఇమ్రాన్​ అతడి అడ్దు తొలగించుకోవాలని పథకం రచించాడు. శుక్రవారం అర్ధరాత్రి ఇంటి దగ్గర రోడ్డుపై ఒంటరిగా ఉన్న అన్సారీ కళ్లలో కారం కొట్టి... తన వద్ద ఉన్న కత్తితో 22 పోట్లు పొడిచాడు.

అన్సారీ అరుపులు విన్న స్థానికులు, ఆఫ్రీన్​ బయటకు రావడంతో ఇమ్రాన్ పారిపోయాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని... మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఇమ్రాన్ గతంలో ఇతర నేరాలకు పాల్పడి పీడీ యాక్ట్‌ కింద శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైనట్లు సమాచారం.

ఇదీ చదవండి: పేకాట కోసం 50 ఎకరాలు అమ్మాడు.. చివరికి దొంగగా మారాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.