డిగ్రీ చదివి బంగారు భవిష్యత్తు గురించి కలలు కంటూ... పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న ఓ యువకుడు మృతి చెందాడు. కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీవో కాలనీలో నూనెపల్లెకు చెందిన వెంకటకృష్ణ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత కొన్ని నెలలుగా బ్యాంకు కోచింగ్ తీసుకుంటూ.. స్థానికంగా... ఓ గదిలో అద్దెకు ఉంటున్నాడు. గదిలో పైన ఉన్న కొక్కికి, టవల్‌తో ఉరివేసుకుని మృతి చెందాడు. చేతులకు, కాళ్లకు తాడుతో కట్టి ఉండడంతో ఇది ఆత్మహత్యా లేక హత్యా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో
"ఐ హేట్ మై లైఫ్ . నా చావుకు ఎవరు బాధ్యులు కారు . ఒంటరిగా ఏడుస్తూ పుట్టాను. ఒంటరిగా ఏడుస్తూ చస్తున్నాను. జీవితంతో పోరాటం నా వల్ల కాలేదు" అని రాసి ఉంది.
- ఇదీ చదవండి: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య