ఎక్సైజ్ పోలీసుల వేధింపులు తాళలేక వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన రాజయ్య పోలీస్‌స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకి పాల్పడ్డాడు. లాక్డౌన్ సమయంలో అక్రమంగా మద్యం అమ్ముతూ రాజయ్య పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసు విషయమై తన సరకును ఇవ్వాలంటూ పోలీసులను వేడుకున్నా అతనిని కరుణించలేదు. ఈ క్రమంలో పోలీసులు వేధింపులకు గురి చేశారని మనస్తాపానికి గురైన రాజయ్య.. పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపులే కారణమంటూ మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
ఇదీ చదవండి: జన్‌ధన్ ఖాతాదారులలో నగదు జమ