ETV Bharat / jagte-raho

వీడియో వైరల్​: వైకాపా నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం - Suicide attempt by Muslim Maujam in Guntur district

వైకాపా నేతల వేధింపులు తాళలేకపోతున్నానని ఆవేదన చెందుతూ.. మౌజమ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో జరిగింది. ఆత్మహత్యాయత్నానికి ముందు.. బాధితుడు తీసుకున్న సెల్పీ వీడియో ఇప్పడు వైరల్​గా మారింది.

వీడియో వైరల్​: వైకాపా నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Nov 23, 2020, 6:16 PM IST

వైకాపా నాయకులు తనపై దాడి చేశారని ఆరోపిస్తూ.. మహమ్మద్ హనీఫ్ అనే మౌజమ్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం తాపిరెడ్డి పాలెంలో గత కొన్నేళ్లుగా మహమ్మద్ హనీఫ్ మౌజమ్​గా పనిచేస్తున్నారు. రెండు రోజుల కిందట తాపిరెడ్డిపాలెంలోని ఖబరిస్తాన్​లో గ్రావెల్స్ తవ్వుతున్న కొందరు వ్యక్తులను హనీఫ్ అడ్డుకున్నారు.

ఈ క్రమంలో.. కొందరు ఆదివారం సాయంత్రం మహమ్మద్ హనీఫ్​పై దాడికి దిగారు. వైకాపా నేతలే ఈ పని చేశారని హనీఫ్ ఆరోపించారు. ఈ ఘటనను.. అవమానంగా భావిస్తూ ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అంతకు ముందు సెల్ఫీ వీడియో తీశాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

వీడియో వైరల్​: వైకాపా నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం

ఇదీ చదవండి: గ్రానైట్​ వ్యాపారి దారుణ హత్య.. పక్కనే ఓ మహిళ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.