ETV Bharat / jagte-raho

కొడుకుని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి - hyderabad latest news

A mother who killed her son and committed suicide in hyderabad
కొడుకుని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి
author img

By

Published : Jul 28, 2020, 8:59 AM IST

Updated : Jul 28, 2020, 9:50 AM IST

08:56 July 28

కొడుకుని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

కొడుకుని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

హైదరాబాద్ ఎల్బీనగర్​లోని శాతవాహన కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి కన్న కొడుకుని హత్య చేసి ఆత్మహత్య చేసుకుంది. భువనగిరి జిల్లా వలిగొండ మండలం వరకట్​పల్లికి చెందిన శంకరయ్య, మమత దంపతులు గత కొంత కాలంగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాతవాహన కాలనీలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు రియాన్ష్​ ఉన్నాడు.  

సోమవారం రాత్రి మమత కూమారుడి చేతిని గాయపరిచి అనంతరం మూడంతస్తుల భవనం పైనుంచి దూకి అత్మహత్యకు పాల్పడింది. తీవ్ర రక్తస్రావంతో రియాన్ష్​ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భర్త వేధింపులు తాళలేక అత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

Last Updated : Jul 28, 2020, 9:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.