కరీంనగర్‌లోని ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈ కార్యాలయం ఆవరణలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్‌ఈ కార్యాలయం ఆవరణలోని స్టోర్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక నగరపాలక సంస్థ మేయర్ సునీల్‌రావు పరిశీలించారు.
ఇదీ చదవండి: రికవరీలే ఎక్కువ.. మరణాలు తక్కువే!