ETV Bharat / jagte-raho

దోమ పోటు సోకిందని వరి పంటకు నిప్పు పెట్టిన రైతు - bhiknur latest news

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి కదా అని తనకున్న మూడెకరాల పొలంలో వరి పంట వేశాడు. పంట చేతికొస్తుందని ఆనందపడ్డాడు. కానీ ఆ రైతు ఆనందం ఎంతో కాలం నిలవలేదు. దోమపోటు రూపంలో అతని ఆశలు అడియాశలయ్యాయి. క్వింటా ధాన్యం కూడా చేతికందే పరిస్థితి లేదు. ఫలితంగా మనస్తాపం చెందిన ఆ రైతన్న.. పంటకు నిప్పుపెట్టాడు.

A farmer set fire to a rice crop after being infected by a mosquito
దోమ పోటు సోకిందని వరి పంటకు నిప్పు పెట్టిన రైతన్న
author img

By

Published : Oct 27, 2020, 1:24 AM IST

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్​లో ఓ రైతు తన వరి పంటకు నిప్పు పెట్టాడు. ఎన్నో ఆశలతో సాగు చేసుకున్న మూడెకరాల సన్న రకం వరి పంటకు దోమపోటు సోకింది. ఫలితంగా పంటంతా నాశనమయ్యింది.

మూడెకరాల పొలంలో కనీసం క్వింటా ధాన్యం కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన రైతు.. తన చేతులతోనే పంటకు నిప్పు పెట్టాడు. చూస్తుండగానే పంటంతా కాలి బూడిదైంది.

ఇదీ చదవండి: ధరణి పోర్టల్‌పై తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లకు రేపు శిక్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.