ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన జాఫ్రీన్(8) తన తల్లి షేక్ నజీర్‌బేగంతో కలిసి ఆదివారం పంట పొలానికి వెళ్లింది. మధ్యాహ్నం తల్లి పొలం పనిలో నిమగ్నమవడం వల్ల చిన్నారి ఆమెవైపు వెళ్తుండగా అక్కడే చెట్లలో ఉన్న అడవి పంది ఒక్కసారిగా దాడి చేసింది.
తీవ్రగాయాలపాలైన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. కవ్వాల్ టైగర్ రిజర్వు ఎఫ్‌ఆర్‌ఓ వాహబ్ అహ్మద్ ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.
ఇదీ చూడండి: అన్నను రోకలిబండతో కొట్టి హతమార్చిన చెల్లెలు