ETV Bharat / jagte-raho

రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు - అన్నోజిగూడ వద్ద కారు ప్రమాదం

ఘట్​కేసర్ పోలీస్​స్టేషన్ పరిధి అన్నోజిగూడ వద్ద వేగంగా వచ్చిన కారు రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

A car that collided with a person crossing the road
రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు
author img

By

Published : Oct 12, 2020, 5:16 PM IST

హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఓ కారు అతివేగంగా దూసుకురావడం వల్ల ఓ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ పోలీస్​స్టేషన్ పరిధి అన్నోజిగూడ వద్ద ఆర్‌జీకే కాలనీకి చెందిన బస్వరాజు రోడ్డు దాటుతున్నాడు.

అదే సమయంలో భువనగిరి నుంచి ఉప్పల్ వైపు వేగంగా వెళ్తున్న కారు అతనిని ఢీ కొట్టింది. ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పోలీసు పెట్రోలింగ్‌ సిబ్బంది, 108 వాహనానికి సమాచారం ఇవ్వగా వారు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : చెరువులో దూకి తల్లీకుమార్తెల ఆత్మహత్య.. అత్తింటి వేధింపులే కారణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.