నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సోన్పేట్ వద్ద ఓ కారు కాలిబూడిదైంది. నిర్మల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టింది. మంటలు అలుముకుని చూస్తుండగానే దగ్ధమైంది.
కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: ఊహించని ప్రమాదం... తప్పిన అపాయం