పండగపూట పతంగి ఆట సంబరం ఓ బాలుడి నిండు ప్రాణాల్ని బలిగొంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెల్లి గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయిలు, వెంకటమ్మ కుమారుడు పదమూడేళ్ల రాకేష్ గాలిపటం ఎగురవేస్తుండగా.. ఆ గాలిపటం విద్యుత్ వైర్లకు చిక్కుకుంది.
వైర్లలో చిక్కిన ఆ పతంగిని తీయడం కోసం ఇనుప రాడ్తో లాగడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా విద్యుత్ఘాతం తగిలి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కాపాడడానికి వెళ్లిన అక్క సోనికి కూడా గాయాలయ్యాయి. ఆమెని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: కొలిక్కిరాని చర్చలు- 19న మరోసారి భేటీ!